శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
(అనృతము - లేనిదున్నట్ట్లు కనబడునది.)అనృత వస్తువునందుగూడ బ్రయోజనము కుపయోగమయిన పనియున్నది. (చీకటిలో నున్న) మ్రోడునుచూచి భయపడుచున్నారుకదా? కనుక అనృతములైన వస్తువులు భాసించుగాక. కార్యమును సాధించుగాక. (అవి యనృతములేయని తా.) అర్ధక్రియా కారిత్వమనగా: మన్నుగా నున్నప్పుడు నీరు తెచ్చుకొన వీలులేదు, కుండగా నయినపుడు నీరుపోసికొననుపయోగించును. అట్లే నూలుగా నున్నప్పుడొక వస్తువు నందు మూటకట్టలేము. అదే బట్టగా నేసితే యింకొక వస్తువును మూటకట్ట వీలగును. అదే యర్ధక్రియాకారిత్వము.
ReplyDeleteఅర్థక్రియానృతేఽవ్యస్తి స్థాణౌ చోరభయేక్షణాత్|
ReplyDeleteతతోనృతాఘటాద్యాః స్యుర్బాంతుకుర్వంతు వా క్రియామ్|| ౨౮
(అనృతము - లేనిదున్నట్ట్లు కనబడునది.) అనృత వస్తువునందుగూడ బ్రయోజనమున కుపయోగమయిన పనియున్నది. (చీకటిలో నున్న) మ్రోడునుచూచి భయపడుచున్నారుకదా? కనుక అనృతములైన వస్తువులు భాసించుగాక. కార్యమును సాధించుగాక. (అవి యనృతములేయని తా.) అర్థక్రియా కారిత్వమనగా; మన్నుగా నున్నప్పుడు నీరు తెచ్చుకొన వీలులేదు, కుండగా నయినపుడు నీరుపోసికొన నుపయోగించును. అట్లే నూలుగా నున్నప్పుడొక వస్తువు నందు మూటకట్టలేము. అదే బట్టగా నేసితే యింకొక వస్తువును మూటకట్ట వీలగును. అదే యర్థక్రియాకారిత్వము.