శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
ఇంద్రుడు, రాజు ఇత్యాది దేహములందు నానాఖ్యాదములను - (1) భక్ష్యములను దినుచు బాలురతో గూడి నవ్వుచు, నొకపుడు స్త్రీలతో గూడి విహరించుచు (ముందుకన్వయము) ____________________________________________________(*అనువాదకులు శ్రీ శాస్త్రిగారు'ఖాద్య''శబ్దమునకు'భక్ష్యమని యర్థము వ్రాసినారు.'నానాఖాద్యాదిభక్షయ.' యని మూలము. ఇట భక్ష్యమనియే యర్థము జెప్పికొనిన యేనుగులు, గుర్రములు భుజించునవి భక్ష్యములే యగునా? అని శంక, అట్లుగాక 'ఖాద్యము' నకు 'గ్రాసము' అని చెప్పుకొన్నచో నన్నిజీవుల యాహారములకును వర్తించును. ఖాద్యము - భుజించునట్టి యాహారము వస్తువుఅని యర్థము.)
ReplyDelete