శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
ప్రాణప్రజ్ఞలభ్రాంతికి అధిష్ఠానము ఆధారమగుట చేత, దానికి హేతువుగా నంగీకరించుటవలన బ్రాణప్రజ్ఞలచేతను దెలుపబడిన యాత్మ తెలియదగును. ఎట్లనిన గొమ్మచివరనున్న చంద్రుని దెలియునట్లు, (విదియ చంద్రుడు సూక్ష్మరూపుడగుటచే చూడలేని వారికి జూచినవా డదిగో; యా చెట్టుకొమ్మమీద జంద్రుడున్నాడనును. అప్పుడాకొమ్మనుబట్టి చంద్రుని చూచుటకు, చంద్రజ్ఞానమునకు గొమ్మహేతువైనది. నిజముగా చంద్రుడు కొమ్మమీద లేనందున గొమ్మమీద జంద్రుడన్నది భ్రమయే యగును. లక్ష్యము చంద్రుడు, ఉపలక్షణము కొమ్మ. )
ReplyDelete