శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
పుట్టలో పాము ప్రవేశించినటుల సృజ్యమాన వస్తువులలో దాను జీవ రూపమున ప్రవేశించుట చేతను సత్పదార్థమే బ్రహ్మము. అన్నము మొదలగు వాటి వలె భోగ్యరూప మగుటచేత గూడ సత్పదార్థమే అని యిట్లు అనుమాన ప్రమాణముల చేతనే బ్రహ్మమున్నదని సాధించుట కాదు .మరేమనిన విద్వాంసులకు బ్రహ్మము ప్రత్యక్షముగా గో చరించుట చేత గూడ సత్పదార్థము బ్రహ్మమే.(అనగా బ్రహ్మంమున్నదని విద్వాంసులు చూచి చెప్పు చున్నారని తాత్పర్యము).
ReplyDelete*వి: దీనిలోని భావము:-విద్వాంసుడు బ్రహ్మమును చూచిన వాడనుటలో, విద్వాంసుడు తురీయావస్థ లోని వాడనియే యర్థము. పండితుడు , విద్వాంసుడు,జ్ఞాని , ఋషి, సాధువు, పరమహంస-ఇవన్నియు సమానార్థక ములతో వీత రాగర్థములను బోధించును. అనగా భవ పాశముల నుండి విడివడిన వాడని యర్థము.ఈభావమునే"నానుశోచంతి పండితాః"యని గీత ప్రతిపాదించుచున్నది.